NLR: నెల్లూరు స్వర్ణాల చెరువు ఒడ్డున వెలసి ఉన్న సింహపురి గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరీ అమ్మ వారు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా తొలిరోజు రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అధిక సంఖ్యలో అమ్మవారి మాలలు ధరించారు.