AKP: టీటీడీకి చెందిన నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవ కావిడితో ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం సుదర్శన పెరుమాళ్ స్వామిని పల్లకిలో అధిష్టింప చేసి తిరువీధి సేవ నిర్వహిస్తామన్నారు