GNTR: గుంటూరు మిర్చి యార్డులో 50% కు అమ్మకాలు పడిపోయాయి. దసరా ఉత్సవాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో లారీల రాకపోకలపై నిషేధం విధించారు. దీంతో గుంటూరు మిర్చి యార్డు నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. మిర్చి ధర కూడా క్వింటాకు రూ. 800 వరకు తగ్గుదల అయ్యింది. రానున్న 10 రోజుల్లో రోజుకి 25 వేల టిక్కీల వరకు విక్రయం కూడా కష్టమే అనే మిర్చి ట్రేడర్లు చెబుతున్నారు.