W.G: భీమవరం జిల్లా కలెక్టర్ ఆవరణలో సోమవారం వర్మీ కంపోస్ట్ స్టాల్‌ను కలెక్టర్ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించారు. అనంతరం కిలో ఒక్కింటికి రూ.10 చొప్పున చెల్లించి కొనుగోలు చేసిన రైతులకు 4.5 టన్నుల వర్మీ కంపోస్ట్‌ను కలెక్టర్, జేసీ చేతుల మీదుగా అందజేశారు. రొయ్యల చెరువుల్లో వర్మి కంపోస్ట్ వాడటంతో నీటి నాణ్యత మెరుగుపడుతుందన్నారు.