WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారిని విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. అనంతరం అర్చకులు, భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉత్సవంతో ఆలయంలో భక్తిమయ వాతావరణం నెలకొంది.