KDP: వేంపల్లె పంచాయతీ పరిధిలోని పాపాఘ్ని నదిలో ప్రమాదకర గుంతలు ఉన్నాయి. ఈత సరదా కోసం అటుగా వెళ్తే అందులో చిక్కుకునే అవకాశం ఉంది. ఎస్సై రంగారావు ఆదేశాల మేరకు పాపాఘ్ని నదిలో గుంతలు ఉన్న చోట ప్రమాద సూచికను తెలియజేస్తూ ఎర్రజెండాలు కట్టారు. తల్లిదండ్రుల తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.