E.G: సీతానగరం మండలం ప్రజలకు ఆధార్ సేవలు అందించేందుకు నవంబర్ 23 నుంచి 26 వరకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ఎంపీడీవో మూర్తి తెలిపారు. 23, 25న బొబ్బిల్లంక, 24న మిర్తిపాడు, 26న ముగ్గళ్ల సచివాలయాల్లో సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మూర్తి కోరారు.