KDP: దసరా పండుగ సందర్భంగా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ప్రజలు సహకరించాలని డీఎస్పీ బావన విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామని వీటిని ప్రజలు పాటించాలని కోరారు. ప్రధాన ఆలయాల వద్ద కంట్రోల్ రూమ్లు, పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు.