MHBD: తొర్రూరు మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన ఆశా వర్కర్ దంపతుల కుమారుడు గూడెల్లి రఘు వంశీ MBBS సీటు సాధించాడు. తెలంగాణ రాష్ట్రంలో 3618 ర్యాంకు, 415 మార్కులతో నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు పొందాడు. రఘు వంశీ 10వ తరగతి మడికొండ గురుకుల పాఠశాలలో, ఇంటర్ ప్రభుత్వ గురుకుల వేలేరులో చదివారు. ఈ విజయంపై గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు అభినందించారు.