GDWL: జిల్లాలో నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించేందుకు ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సోమవారం జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.ప్రియాంక తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మేళా జరుగుతుందన్నారు. 18-35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.