MBNR: జిల్లా పరిధిలోని మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహన్ సోమవారం తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా దర్యాప్తు చేసి పూర్తి చేయాలని, ప్రతి కేసులో ప్రజలకు న్యాయం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీలో ఎస్సై శేఖర్ రెడ్డితో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.