కోనసీమ: అంబాజీపేట మండలం లో గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. కె.పెదపూడి- కొత్తపాలెం వంతెన వద్ద ఉన్న అప్సర కౌశిక గట్టుపై సోమవారం ఓఎన్జీసీకి చెందిన గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. దీనిని రైతులు గమనించి వెంటనే అంబాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. వారు ఓఎన్జీసీ అధికారులకు తెలియజేయడంతో లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించి అదుపులోకి తెచ్చారు.