ADB: దుర్గా నవరాత్రి ఉత్సవాలలో డీజేలకు అనుమతులు లేవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మహిళా సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహిళలు అత్యవసర సమయాలలో డయల్ 100 ను సంప్రదించాలని సూచించారు. నిమర్జన ఉత్సవాలను సరైన సమయంలో పూర్తి చేయాలని కోరారు.