NRML: భైంసా మండలం హంపోలి గ్రామంలో పేదల ఇండ్ల స్థలాలపై జరిగిన అక్రమ పట్టాల రద్దు చేయాలని కోరుతూ CPIML (న్యూ డెమోక్రసీ) పార్టీ నేతృత్వంలో నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నాయకులు రాజు ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. 1983 వరద బాధితులకు కేటాయించిన 5 ఎకరాల భూమిపై ఇండ్లను కూల్చి అక్రమ పట్టాలు జారీ చేశారని ఆరోపించారు.