ఉమ్మడి కడప జిల్లా ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్లను వెంటనే జమ చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణమరాజు డిమాండ్ చేశారు. సోమవారం కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో పరిపాలనాధికారి విజయభాస్కర్ రెడ్డిని కలిసి సంబేపల్లి ఉపాధ్యాయుల డిసెంబర్ 2021, జనవరి 2022 మిస్సింగ్ క్రెడిట్ల వివరాలను అందజేశారు.