NRML: కుబీర్ పోలీస్ స్టేషన్ను సోమవారం అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు సీసీటీవీల నిఘా, గ్రామాల్లో బస్తీ పెట్రోలింగ్ చేపట్టాలని కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డికి వివరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.