W.G: పాలకొల్లు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకారం సోమవారం పట్టణంలోని గాంధీ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాతపాటి హరికుమార్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. పట్టణ అధ్యక్షుడిగా గోగులమండ భాస్కరరావు, యలమంచిలి మండల అధ్యక్షుడిగా నాగమోహనరావు, పోడూరు మండల అధ్యక్షుడిగా బొలిశెట్టి భానుప్రకాష్ ప్రమాణస్వీకారం చేశారు