SRD: పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ పరదేశి పంకజ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డులకు జాకెట్స్, రెయిన్ కోట్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్యూటీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రావు పాల్గొన్నారు.