GNTR: ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన కళాతపస్వి కె. విశ్వనాథ్ ఉమ్మడి గుంటూరు జిల్లా పెదపులివర్రులో జన్మించారు. ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధామైనవి. 2016లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు.