AKP: కోటవురట్ల మండలం కొడవటిపూడి జడ్పీ హైస్కూల్లో దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో దేవతామూర్తుల వేషాలు వేయించి దసరా ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు. విద్యార్థులు ఇంటింటికి వెళ్లి దసరా పాటలు పాడుతూ గ్రామస్తులను ఆనందింప చేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ అప్పారావు మాట్లాడుతూ.. పూర్వం ఇదే ఆచారాన్ని పాటించేవారన్నారు.