»Dav School Driver Sentenced To 20 Years In Prison Nampally Court Verdict
DAV School: డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష..బాలిక ఘటన నేపథ్యంలో తీర్పు
హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్లో(DAV School) ఓ బాలికపై డ్రైవర్ చేసిన ఆకృత్యాలకు గాను నాంపల్లి కోర్టు తాజాగా శిక్షను ఖరారు చేసింది. ఈ క్రమంలో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్(DAV School)లో చదువుతున్న నాలుగేళ్ల బాలిక ఎల్కేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ ఉందంతానికి పాల్పడిన కేసులో రంజిత్ కుమార్‌కు నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు బుధవారం 20 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో నిందితుడిని 2022 అక్టోబర్ 19న అరెస్టు చేశారు.
పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి వద్ద నిందితుడు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆ క్రమంలో చిన్నారిపై పలుమార్లు దాడి చేయడంతో బాధిత బాలిక ప్రవర్తనలో మార్పులను గమనించిన తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ మైనర్ తన బాధను వారికి చెప్పి, దారుణమైన చర్యకు పాల్పడిన డ్రైవర్‌ను చూపించింది.
పాఠశాలలో ప్రయోగశాలలను నిర్వహించడం, తరగతి గదిలో పిల్లలపై దాడి చేసిన సిబ్బంది కోసం విధులు నిర్వహించడం వంటి ఇతర పనులను కూడా డ్రైవర్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించింది. రంజిత్ కుమార్, డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంజిత్ కుమార్‌పై భారత శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 364, 376 (ఎ) (బి), పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.