AP: AP, TGలో మెజారిటీ ప్రాజెక్టులు తాను ప్రారంభించినవేనని CM చంద్రబాబు అన్నారు. ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ జిల్లాకు శ్రీశైలం ద్వారా నీరు ఇచ్చామని తెలిపారు. ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక సాగునీటి సంఘాలు వేశామని గుర్తు చేశారు.