SRD: పుల్కల్ మండలం సింగూర్ జలాశయంలో 52,649 క్యూసెక్కులు వరద చేరుతున్నారని ఇరిగేషన్ అధికారి స్టాలిన్ శుక్రవారం ఉదయం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత నాలుగు రోజుల నుంచి నిరంతరంగా 6 గేట్ల ద్వారా 48,242 క్యూసెక్కులు నీళ్లు దిగువకు విడుదలవుతున్నాయి. నీటిమట్టం 17.215 టీఎంసీల వద్ద నిల్వ ఉంది. మంజీరా నది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.