»Argument Between Minister Malla Reddy And Sudheer Reddy On Stage At Medchal
Minister Malla Reddy, సుధీర్ రెడ్డి మధ్య స్టేజ్ పైనే వాగ్వాదం
ఇటీవల మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన BRS ఆత్మీయ సమ్మేళనం సభలో రసాభాస చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి మల్లా రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ క్రమంలో ఏకంగా స్టేజ్ పైనే గొడవకు దిగారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
మేడ్చల్ నియోజకవర్గంలో స్థానిక మంత్రి, మాజీ ఎమ్మెల్యేల మధ్య మరోసారి లొల్లి మొదలైంది. ఇటీవల మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన BRS ఆత్మీయ సమ్మేళనం సభలో మంత్రి మల్లా రెడ్డి(Minister Malla Reddy), మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి(Sudheer Reddy) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వేదికపైనే వీరిద్దరూ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకున్నారు.
అయితే మంత్రి మల్లారెడ్డి తీరుపై మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మీయ సమావేశాలకు బీఆర్ఎస్(BRS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు తనను పిలవడం లేదన్నారు. ఈ క్రమంలో పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండి పడ్డారు.
మేడ్చల్ నియోజకవర్గంలో కూడా సుధీర్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్సే(ex MLA) పేర్కొన్నారు. కానీ మంత్రి మల్లారెడ్డి మాత్రం అలా చెప్పడం లేదన్నారు. ఆ క్రమంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతుండగా వేదికపైనే ఉన్న మల్లా రెడ్డి కోపగించుకున్నారు. సుధీర్ రెడ్డి నుంచి మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గమనించి వారిద్దరిని ఆపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా మంత్రిపై సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారని సుధీర్ రెడ్డి నిలదీశారు.
ఇంకోవైపు మేడ్చల్ నియోజకవర్గానికి తాను వాచ్ మెన్ గా పనిచేస్తున్నానని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని గుర్తు చేశారు. బోడుప్పల్ వక్ఫ్ బోర్డు సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.