»A Man Did Not Sleep For 19 Days Even Guinness Books Stopped Counting It
453 Hours With Out Sleep : వామ్మో.. వీడు మనిషేనా 453గంటలు నిద్రపోకుండా..
ఒక వ్యక్తి 453 గంటల 40 నిమిషాలు అంటే 19 రోజులు కళ్లు మూసుకోకుండా మెలకువగా ఉన్నాడంటే నమ్మగలరా. అవును ఇది నిజంగా జరిగింది. 1986లో రాబర్ట్ మెక్డొనాల్డ్ (robert macdonald) అనే వ్యక్తి ఈ ఫీట్ చేసి తన పేరు మీద ఎక్కువ సేపు మెలకువగా ఉన్న ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఘనత ఎంత ప్రమాదకరమైనదంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఛాలెంజర్లు కూడా ఓడిపోయారు.
453 Hours With Out Sleep : ఒక్క రోజు కంటి నిండా నిద్రలేకుంటేనే మరుసటి రోజు మనం నీరసమైపోతాం. అలాంటిది ఒక వ్యక్తి 453 గంటల 40 నిమిషాలు అంటే 19 రోజులు కళ్లు మూసుకోకుండా మెలకువగా ఉన్నాడంటే నమ్మగలరా. అవును ఇది నిజంగా జరిగింది. 1986లో రాబర్ట్ మెక్డొనాల్డ్ (robert macdonald) అనే వ్యక్తి ఈ ఫీట్ చేసి తన పేరు మీద ఎక్కువ సేపు మెలకువగా ఉన్న ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఘనత ఎంత ప్రమాదకరమైనదంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఛాలెంజర్లు కూడా ఓడిపోయారు. గిన్నిస్ బుక్ వారు రాబర్ట్ మెక్డొనాల్డ్ నెలకొల్పిన రికార్డ్ తర్వాత ఇప్పటి వరకు తన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారని అంటున్నారు. వారు తమ వెబ్సైట్(website)లో ఈ మెక్డొనాల్డ్స్ రికార్డును పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమైన క్రీడ అని గిన్నిస్ బుక్ అభిప్రాయపడింది. నిద్రలేమి వల్ల చాలా మందికి ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి విషయాలు భవిష్యత్ లో మానవాళికి ప్రయోజనకరంగా ఉండదని మళ్లీ అలాంటి రికార్డులను నమోదు చేయలేదు.
మెక్డొనాల్డ్ కంటే ముందు 1963లో ఇద్దరు విద్యార్థులు ఈ రికార్డును నెలకొల్పారని ఓ నివేదిక పేర్కొంది. పాఠశాల సైన్స్ ప్రాజెక్ట్(science project) కోసం 11 రోజులు వారు నిద్రలేకుండా కష్టపడ్డాడు. అప్పుడే ఎక్కువసేపు మేల్కొని ఉన్న ప్రపంచ రికార్డు నెలకొల్పారు. రాండీ గార్డనర్(Randy Gardner),బ్రూస్ మెక్అలిస్టర్(Bruce McAllister) తగినంత నిద్ర లేకపోవడం వారి మెదడులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో నిద్ర పరిశోధకుడు విలియం డిమెంట్ అతని పనితీరును రికార్డ్ చేసి విస్తృత పరిశోధనలు చేశారు. రాండీ గార్డనర్కు స్వల్పకాలిక జ్ఞాపకశక్తి తగ్గిందని వారు కనుగొన్నారు. అతనికి ఏకాగ్రత కొరవడింది. రాండీ మెదడును స్కాన్ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రాండీ మెదడులో కణాలు పని చేయడం ఆగిపోయాయి. ఆ తర్వాత 2007లో, టోనీ రైట్ 266 గంటలపాటు మెలకువగా ఉన్నాడు. అతను రాండీ రికార్డును బద్దలు కొట్టాలని ఆశించాడు.. కానీ అది జరగలేదు. నిద్ర లేకపోవడం చాలా అలసిపోతామని.. మెదడు అస్సలు పనిచేయదని అతను అంగీకరించాడు.