SRCL: వరిలో ఆశించే కాండం తొలుచు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలని వ్యవసాయ కళాశాల ఆచార్యులు తెలిపారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని బాబూ కళాశాల దత్తత గ్రామమైన రాళ్లపేటలో కళాశాల ఆచార్యులు వరి పంటలను బుధవారం పరిశీలించారు. కళాశాల ఆచార్యులు సతీష్, సంపత్ కుమార్, యశస్విని, గ్రామ మాజీ సర్పంచ్ పరశురాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు.