అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పెన్సిల్వేనియాలో ఓ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతుండగా ఒక్కసారిగా దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు మృతి చెందారు. మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. వెంటనే తేరుకున్న అధికారులు ఎదురుకాల్పులు జరిపి నిందితుడిని హతమార్చారు.