ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత పేరు ట్రెండింగ్‌లో ఉంది. యశోద దుమ్ములేపిందని అంటున్నారు. హెల్త్ సహకరించకపోవడంతో.. యశోద సినిమా ప్రమోషన్స్ పెద్దగా చేయలేకపోయింది సమంత. ఒకటి అరా ఇంటర్య్వూలు.. సోషల్ మీడియాతోనే సరిపెట్టింది. అయితే సమంత పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. మయోసైటిస్ సింపతి యశోద సినిమాకు మరింత ప్లస్ అయింది. అనుకున్నట్టే యశోద హిట్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ వారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది యశోద. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంత అదరగొట్టిందని అంటున్నారు. దాంతో యశోద టీమ్ సక్సెస్ సెలబ్రేషన్లో ఉంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కాస్త గట్టిగానే జరిగిందని అంటున్నారు. అందుకు తగ్గట్టే.. వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే మూడు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు టాక్. అలాగే ఓవర్సీస్‌లోను యశోదకు మంచి ఓపెనింగ్స్ దక్కినట్టు తెలుస్తోంది. ప్రీమియర్స్‌తో పాటు.. మొదటి రోజు 2 లక్షల డాలర్స్ మార్క్‌ని క్రాస్ చేసినట్టు సమాచారం. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. యశోద పై కాపీ కామెంట్స్ ఎక్కువయ్యాయి. హాలీవుడ్ మూవీస్ ‘లెవెల్ 16’, ‘ది ఐలాండ్’ నుంచి యశోదను కాపీ కొట్టారని అంటున్నారు. కొన్ని సీన్లను మక్కికి మక్కీగా తీశారని.. ఆ సినిమాల ట్రైలర్‌ను చూపిస్తున్నారు. ఈవా సెంటర్లో జరిగే సీన్లతో పాటు.. బిల్డింగ్ డిజైనింగ్ కూడా అలాగే ఉందని అంటున్నారు. దాంతో యశోదకు కూడా కాపీ సెగ తగులుకుందని చెప్పొచ్చు. కాబట్టి యశోదకు కూడా ఇదంతా కామన్ అని చెప్పొచ్చు.