TG: నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని చెప్పారు. పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్లో కలిసిందని అన్నారు. ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టమని, సర్దార్ పటేల్ ముందు నిజాం తన ఓటమిని ఒప్పుకున్నారని పేర్కొన్నారు.