ADB: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదిలాబాద్ పట్టణానికి మంగళవారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పెనుగంగా గెస్ట్ హౌస్కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ రాజర్షి షా, SP అఖిల్ మహాజన్ ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం జిల్లా పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై షబ్బీర్ అలీతో చర్చించారు.