విజయనగరం ISIS కేసులో NIA దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, యూపీ, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీలోని 16 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. ఈ దాడుల్లో డిజిటల్ పరికరాలు, పత్రాలు, నగదు స్వాధీనం చేసుకుంది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ను ఇటీవల ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.