KRNL: 440 గ్రాముల గంజాయి పట్టుకున్నట్లు కర్నూల్ ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ తెలిపారు. మంగళవారం పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో ఇద్దరు అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీ చేశామన్నారు. అందులో 440 గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. గంజాయి, బొలెరోను స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.