ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సైబర్ నేరాలు(Cyber Crimes) మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ విషయంలో తమ యూజర్లను, ప్రయాణికులను ఐఆర్సీటీసీ(ISRTC) హెచ్చరించింది. ఐఆర్సీటీసీ పేరుతో ఓ నకిలీ యాప్(Fake App) విషయంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రజలను అలర్ట్ చేసింది.
ఐఆర్సీటీసీ కనెక్ట్(ISRTC Connect) పేరుతో ఓ యాప్ కు సంబంధించిన ఏపీకే ఫైల్ వాట్సాప్, టెలిగ్రామ్ లో వైరల్ అవుతోందని యూజర్లను హెచ్చరించింది. ఈ యాప్ ను ఎవ్వరూ ఇన్స్టాల్ చేసుకోవద్దని, వారి ఫోన్లు సైబర్ ప్రమాదాల(Cyber crimes) బారిన పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నకిలీ యాప్(Fake App) ద్వారా నేరగాళ్లు యూజర్ల(Users) వ్యక్తిగత సమాచారం, యూపీఐ(UPI), బ్యాంకింగ్ వివరాలను(Banking Informations) తస్కరించే అవకాశం ఉందని, ఐఆర్సీటీసీ(ISRTC) అధికారులు అని చెప్పుకునే కొందరు వ్యక్తులు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని యూజర్లను ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదు అందినట్లు తెలిపింది. అందుకే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి మాత్రమే ఐఆర్సీటీసీ యాప్ (ISRTC App)ను డౌన్లోడ్ చేసుకోవాలని హెచ్చరించింది.