కృష్ణా: మోపిదేవి మండలంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. రూ.43.60 లక్షలతో నాగాయతిప్పలో నూతన గ్రామ సచివాలయం, కోసూరువారిపాలెంలో రూ.23.94 లక్షలతో నూతన రైతు సేవా కేంద్రం ప్రారంభించనున్నారు. కోసూరువారిపాలెంలో రూ.38.50లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్లు ప్రారంభిస్తారు.