TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు వ్యూహాలపై CM రేవంత్.. మంత్రులు, కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ‘జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికను AICC చూసుకుంటుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పోలీంగ్ బూత్ల వారీగా ప్రచారం చేయాలి. కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని భరోసా కల్పించాలి. గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి పని చేయాలి’ అని చెప్పారు.