పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా అప్రమత్తంగా ఉండాలని మందస హరిపురం పశువైద్యాధికారులు డీ. శ్రీకాంత్, ఉమా భారతీలు సూచించారు. మందసలో వారు మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు చేపడుతున్న ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంను పాడి రైతులు సద్వినియోగ పరుచుకోవాలన్నారు.