సత్యసాయి: గుడిబండ మండలం తాళికేర పంచాయతీ BT పల్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో వారికి పసుపు కండువాలు కప్పి, స్వాగతించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి మద్దతుగా ఈ చేరికలు జరిగాయని తిప్పేస్వామి తెలిపారు. చేరిన వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.