మేకర్స్ నుంచి అఫిషీయల్ అప్టేట్ లేకపోయినా.. ఎట్టకేలకు పుష్ప2 సెట్స్ పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను నిన్న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టినట్టు సమాచారం. అక్కడ వేసిన ఓ ప్రత్యేక సెట్లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేస్తున్నారట. అయితే ఈ షెడ్యూల్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేకుండానే చిత్రీకరిస్తున్నారట.
మిగతా నటీనటులతో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారట. ప్రస్తుతం బన్నీ తన ఫ్యామిలీతో కలిసి దక్షిణాఫ్రికాలో ఉన్నారు. తిరిగొచ్చాక పుష్ప సెట్స్‌లో జాయిన్ అవుతాడని టాక్. లేదంటే నెక్ట్స్ షెడ్యూల్ బ్యాంకాక్‌లో ప్లాన్ చేస్తున్నారని.. అక్కడే బన్నీ జాయిన్ అవుతాడని మరో టాక్. ఇక పుష్ప2 సెట్స్ పైకి వెళ్లడంతో అల్లు అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
అయితే మరో విషయంలోను బన్నీ అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. ప్రజెంట్ పుష్ప 2 షూటింగ్ బాహుబలి సెట్స్ వేసిన చోటే జరుగుతోందని టాక్. దీంతో బాహుబలి సెంటిమెంట్ ఈ పాన్ ఇండియా సినిమాకు మరింతగా కలిసొస్తుందని అంటున్నారు. కాకపోతే ఈ ఎపిసోడ్లో ఐకాన్ స్టార్ కూడా ఉంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో.. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి పెరిగిన అంచనాలను పుష్ప2 ఎంతవరకు అందుకుంటుందో..!