SRD: సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రావిణ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని పేర్కొన్నారు.