FIDE గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ 8వ రౌండ్లో గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్, ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 6 గంటలకు పైగా జరిగిన ఈ పోరులో ఇద్దరు చెస్ ఆటగాళ్లు 103 ఎత్తుగడలు ఆడారు. ఇటీవల గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన దివ్య, గుకేశ్‌కు గట్టి పోటీని ఇచ్చింది. ఈ డ్రాతో గుకేశ్ వరుస విజయాల పరంపర 5 మ్యాచ్‌లకు చేరింది.