విశాఖ నగరం ఎంవీపీ సెంట్రల్ నర్సరీలో రూ.99.50 లక్షలతో చేపట్టిన ఎంట్రన్స్ ఆర్చ్, రహదారులు, సిమెంట్ బెంచ్‌లు, ఆఫీస్ రూమ్, టాయిలెట్స్, విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి ఈ పనులను శుక్రవారం ఎమ్మెల్యే రామకృష్ణ బాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ కమిషనర్ విశ్వనాథన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 18వ వార్డు కార్పొరేటర్ మంగ వేణి, ఇంజనీర్ వినయ్ కుమార్ పాల్గొన్నారు.