»Brazilian Model Creates Fragrances Infused With Her Sweat
Brazilian Fragrances : చెమటతో పర్ఫ్యూమ్.. దీని డిమాండ్ మామూలుగా లేదు..!
Brazilian Fragrances : మనలో చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, ఆాఫీస్, కాలేజ్ కి వెళ్తున్నప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉంటారు. మనం సాధారణంగా పర్ఫ్యూమ్ ఎందుకు కొంట్టుకుంటాం..? మన చర్మం నుంచి చమట కారణంగా దుర్వాసన రాకుండా ఉండాలని... మంచి సువాసనలుు వెదజల్లాలని కొట్టుకుంటాం.
మనలో చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, ఆఫీస్, కాలేజ్ కి వెళ్తున్నప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉంటారు. మనం సాధారణంగా పర్ఫ్యూమ్ ఎందుకు కొట్టుకుంటాం..? మన చర్మం నుంచి చమట కారణంగా దుర్వాసన రాకుండా ఉండాలని… మంచి సువాసనలుు వెదజల్లాలని కొట్టుకుంటాం. కానీ… కేవలం చెమటతోనే పర్ఫ్యూమ్ తయారు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా..? వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఓ యువతి చెమట నుంచి పర్ఫ్యూమ్ తయారు చేసింది. ఇప్పుడు ఆ పర్ఫ్యూమ్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. దాని కథేంటో మనమూ తెలుసుకుందాం…
బ్రెజిలియన్ మోడల్ తన చెమటతో తయారు చేసిన పెర్ఫ్యూమ్ను విడుదల చేసింది. సావో పాలోలో నివసిస్తున్న 29 ఏళ్ల మోడల్ వెనెస్సా మౌరా ఈ పెర్ఫ్యూమ్ను రూపొందించారు. ఆమె మోడల్‌గానే కాకుండా ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఈ నేపథ్యంలో తన చెమటతో పరిమళం తయారు చేసేది.
ఆమె శరీరం నుంచి వచ్చే చమట వాసన చాలా బాగుంటుందని… ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఆమెకు తరచూ చెబుతూ ఉండేవాడట. ఆ వాసన కారణంగే ఆమెకు ఆకర్షితుడిని అయ్యేవాడనిని చెప్పాడట. అతను చెప్పిన మాటలు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ మాటలను సీరియస్‌గా తీసుకుని తన చెమటతో సుగంధాన్ని తయారు చేసింది. దానికి ఆమె ‘ఫ్రెష్ గాడెస్ పెర్ఫ్యూమ్’ అని పేరు పెట్టింది. పెర్ఫ్యూమ్ కారణంగా చాలా మంది ఆన్లైన్ ఫాలోవర్లు నా వైపు ఆకర్షితులయ్యారు అని ఆమె చెప్పడం విశేషం. ఈ పెర్ఫ్యూమ్లో ఆమె చెమటతో పాటు ఇతర పదార్థాలు కూడా ఉన్నాయి. సీసాలో 8 మి.లీ చెమట కలుపుతామని ఆమె చెప్పడం గమనార్హం.
చెమటతో చేసిన పెర్ఫ్యూమ్ ధర ఎంత?
ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ కంటే ఎక్కువ మంది అనుచరులను కలిగి ఉన్న వెనెస్సా మౌరా.. ఆన్ లైన్ లోనే వీటి అమ్మకాలు మొదలుపెట్టింది. ఎవరైనా తమ భాగస్వామిని ఆకర్షించాలనుకునే వారికి ఈ ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్ సరైన సాధనమని ఆమె చెబుతుండటం విశేషం . నివేదిక ప్రకారం, ఈ పెర్ఫ్యూమ్ ధర 50 ml 138 డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.11వేల రూపాయలు. మరి ఈ పర్ఫ్యూమ్ ని ఎంత మంది కొనడానికి ఆసక్తి చూపుతారో చూడాలి.