NRML: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే అదనపు వరద ప్రవాహాన్ని ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత గోదావరిలోకి వదులనున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ జగదీష్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు, పశువుల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ హెచ్చరికలు అక్టోబర్ చివరి వరకు అమలులో ఉంటాయి.