అన్నమయ్య: ములకళచెరువు మండలం కాలవపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున 90 ఏళ్ల వెంకటలక్ష్మమ్మ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. గతంలో నడుం విరిగి మంచానికే పరిమితమైన ఆమె, జీవితంపై విరక్తి చెంది కరెంట్ హీటర్ పట్టుకుని ఈ చర్యకు పాల్పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి, 108 సిబ్బంది సహాయంతో ఆమెను మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.