WNP: భూమి కోసం విముక్తి కోసం దోపిడికి వ్యతిరేకంగా తిరగబడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్థం ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనాన్ని గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి గిరిజనుల చిరకాల స్వప్నమని, ఎట్టకేలకు ఆకల నెరవేరిందని అన్నారు.