ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. సికింద్రాబాద్లోని రైల్వే కళారంగ్ (Railway Kalarang) వేదిక ద్వారా..వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 248 మంది యువతీ యువకులకు నియామక పత్రాను ఆయన అందేశారు. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి రిఫరెన్సులు, రికమండేషన్లకు తావులేకుండా కేవలం మెరిట్ ద్వారానే ఉద్యోగాలు(jobs) ఇస్తోందన్నారు. భారత యువత శక్తి సామర్థ్యాలపై ప్రధాని మోదీ(PM MODI) కి విశ్వాసం ఉందన్న కేంద్రమంత్రి..అనుసంధానత, మౌలికవసతుల కల్పన, విద్య, వైద్యం, ఫార్మా, రక్షణ, సాంకేతికత ఇలా ప్రతి రంగంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రోత్సాహాన్ని అందిస్తోందని తెలిపారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రోత్సహాన్ని అందిస్తోదని కిషన్ రెడ్డి అన్నారు. 2014లో భారతదేశంలో 5.8 కోట్ల మొబైల్ ఫోన్లు మాత్రమే దేశంలో ఉత్పత్తి అయ్యేవని.. ఇప్పుడా సంఖ్య 31 కోట్లకు పెరిగి.. రూ.2,75,000 కోట్ల విలువైన మొబైల్స్ దేశంలో ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. విదేశాలకు కూడా మన దగ్గర తయారైన మొబైల్స్ పెద్దమొత్తంలో ఎగుమతి అవుతున్నాయన్నారు. పారదర్శక విధానంతో దేశంలో ప్రైవేటు పెట్టుబడుల(Private investments)ను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని, ఇందుకోసం భారతీయులంతా ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ (GM Arun Kumar Jain), అడిషనల్ జనరల్ మేనేజర్ ధనుంజయులు, డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్త, తదితరులు పాల్గొన్నారు.