టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవలె ‘కృష్ణ వింద్ర విహారి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు నాగశౌర్య. ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్లో లేనని.. కానీ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. తెలుగు అమ్మాయి అంటూ చెప్పాడు. దాంతో త్వరలోనే శౌర్య పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమనుకున్నారు. అనుకున్నట్టే ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయాడు నాగ శౌర్య. ఎప్పుడెపపుడా అని చూస్తున్న నాగశౌర్య పెళ్లి కబురు రానే వచ్చింది. ఈ నెల 20వ తేదీన ఆదివారం రోజు.. బెంగుళూరులోని JW మర్రివుట్ అనే ప్రముఖ హోటల్లో నాగశౌర్య వివాహం జరగనుంది.
అనూష అనే అమ్మాయిని నాగ శౌర్య పెళ్లి చేసుకోబోన్నాడు. అనూష వారి బంధువుల అమ్మాయి అని తెలుస్తోంది. నవంబర్ 19న మెహందీ ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. దాంతో ఇప్పటికే నాగ శౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. ప్రస్తుతంపెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు శౌర్య. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధువులతో పాటు.. నాగశౌర్య క్లోజ్ ఫ్రెండ్స్.. పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. అయితే పెళ్లి తర్వాత మరొక రోజు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులకు ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నాగశౌర్య ఇటీవలే NS24 ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు.. ఈ చిత్రానికి అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నాడు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.