హిట్ ఫట్‌తో సంబంధం లేదు.. సినిమా కంటెంట్‌తో కూడా పనిలేదు.. ఖాళీగా ఉండకుండా జస్ట్ సినిమా చేస్తున్నానా? లేదా? అనేదే, యంగ్ హీరో నాగశౌర్య కాన్సెప్ట్‌లా ఉంది. అసలు మనోడు హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. అయినా వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ హిట్స్ మాత్రం పడడం లేదు. రీసెంట్గా వచ్చిన రంగబలి కూడా దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది. రంగబలి క్లోజింగ్ కలెక్షన్స్ ఓ సారి చూస్తే..
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరోలో మంచి కటౌట్ ఉన్న వారిలో నాగ శౌర్య(Naga shaurya) కూడా ఒకడు. కెరీర్ స్టార్టింగ్‌లో ఓ మోస్తారు సినిమాలు చేసినప్పటికీ.. ఇటీవల కాలంలో శౌర్య చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. దాంతో అతని మార్కెట్ కూడా రోజు రోజుకి డౌన్ అవుతునే ఉంది. అయితే రీసెంట్గా వచ్చిన రంగబలి సినిమా మాత్రం.. ఖచ్చితంగా నాగ శౌర్యకి హిట్ ఇస్తుందని అనుకున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా ఓ రేంజ్లో ప్రమోట్ చేశారు. ప్రమోషనల్ కంటెంట్ చూసి.. సినిమా మంచి బజ్ ఏర్పడింది.
ప్రమోషన్స్ కోసమే దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట. కానీ తీరా థియేటర్‌కి వెళ్లాక.. రంగబలి ఆడియెన్స్‌కు బలి చేసేసిందనే టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ హాప్ బాగానే ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్ర ప్రేక్షకులు దారుణంగా బలి అయ్యారు. దాంతో ఈ సినిమా నాగ శౌర్య(Naga shaurya) ఫ్లాప్ లిస్ట్‌లోకి వెళ్లిపోయింది. ఇక నష్టాలు కూడా అదే రేంజ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 6 కోట్ల 50 లక్షల వరకు జరిగగా.. క్లోసింగ్ కలెక్షన్స్ మాత్రం 3 కోట్ల 40 లక్షల షేర్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది.
దీంతో రంగబలి ప్రమోషన్స్ కోసం చేసిన ఖర్చుని కూడా రాబట్టలేకపోయిందని అంటున్నారు. దీంతో నాగశౌర్య(Naga shaurya) మార్కెట్ మరింతగా పడిపోయినట్టేనని అంటున్నారు. అయినా కూడా శౌర్య వరుస సినిమాలు చేస్తున్నాడు. మరి థియేటర్స్‌లో ఆకట్టుకోలేకపోయినా రంగబలి.. కనీసం ఓటీటీ ఆడియన్స్‌ని అయినా మెప్పిస్తుందేమో చూడాలి.