MDCL: కూకట్పల్లిలో 1.20 ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం తీసుకున్న హైడ్రా, దీని విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని తెలియజేసింది. కూకట్పల్లి ఆల్విన్ కాలనీకి ఆనుకుని ఉన్న 276 సర్వే నంబరులో 2.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఇప్పటికే కొన్ని ఇళ్లు నిర్మాణం జరిగాయి. ఇంకా మిగిలి ఉన్న 1.20 ఎకరాల భూమి కబ్జా కాకుండా హైడ్రా కాపాడింది.