తెలంగాణ మంత్రి హరీష్ రావుపై.. ఏపీ మంత్రి బొత్స ఫైర్..!
Telangana : తెలంగాణ మంత్రి హరీష్ రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సీరియస్ అయ్యారు. ఇటీవల హరీష్ రావు కార్మికులతో మాట్లాడుతూ.. ఏపీలో ఓటు హక్కు వదులుకొని తెలంగాణలో ఓటు హక్కు అప్లై చేసుకోండి అంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.
తెలంగాణ మంత్రి హరీష్ రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సీరియస్ అయ్యారు. ఇటీవల హరీష్ రావు కార్మికులతో మాట్లాడుతూ.. ఏపీలో ఓటు హక్కు వదులుకొని తెలంగాణలో ఓటు హక్కు అప్లై చేసుకోండి అంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పలు కీలక వ్యాఖ్యలు చేయగా..తాజాగా మంత్రి బొత్స సైతం ఫైర్ అయ్యారు.
బాధ్యత గల వ్యక్తులు బాధ్యతగా మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ప్రత్యేక హోదాపై ఎవరు మాట్లాడతారో, ఎవరు మాట్లాడరో తమకు తెలుసన్నారు. వారు ముందు తమ రాష్ట్రం గురించి చూసుకోవాలని, చరిత్ర మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని బొత్స అన్నారు. ఏపీ ప్రజలు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అందరికీ తెలుసని, ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నారో హరీశ్రావునే అడగాలని విలేకరులకు సూచించారు.